
ఉప్పునుంతల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సదగోడు, ఉప్పునుంతల ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రవికుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. వ్యాక్సిన్ జరుగుతున్న తీరును పరిశీలించారు. సబ్ సెంటర్లలో వ్యాక్సిన్ కు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. ప్రతి బుధవారము, శనివారం నిర్వహించే వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో చిన్నారులకు వ్యాక్సినేషన్ 100% పూర్తి చేయాలని అదేవిధంగా ఆరోగ్య ఉపకేంద్రంలో సిబ్బంది సమయపాలన పాటించాలని ,వ్యాక్సిన్ నిల్వ చేయు పద్ధతిలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలని తెలిపారు. అదే విధంగా జులై మొదటి వారంలో అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ 18 సంవత్సరాలు పైబడిన వారికి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపీహెచ్వో కేశవులు, డిఐఓ డాక్టర్ రవికుమార్ ,ఫార్మసిస్ట్ శ్రీనివాసులు, ఎం పి హెచ్ ఈ ఓ మధు నాయక్, పి హెచ్ ఎన్ జోన్స్, ఏఎన్ఎం లక్ష్మి, దేవి, వీణ పాల్గొన్నారు.