
యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్సు ,సైఫాబాద్ వైస్ ప్రిన్సిపాల్ గా కెమిస్ట్రీ విభాగానికి చెందిన డా.ఎస్.అరవింద్ నియమితులయ్యారు. శుక్రవారం ఓయూ వీసీ ప్రొ. యం.కుమార్ నియామక పత్రము అందజేశారు. సైఫాబాద్ సైన్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సీమ అరవింద్ కి సైఫాబాద్ సైన్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గా నూతనంగా నియమితులైన సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ. కె.శైలజ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తాజా మాజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నవనీత, డాక్టర్ సునీత మంజరి, లెఫ్ట్నెంట్ నరేష్,అసిస్టెంట్ రిజిస్టర్ షానవాస్ పాల్గొన్నారు.