
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని సహస్ర ఫౌండేషన్ చైర్మన్ తెలంగాణ హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి గ్రామంలో తెలంగాణ అమరుల కుటుంబాలను ఆదివారం కలిసి వారిని సన్మానించి బోయ శ్రీధర్ మరియు పల్చం లోకేష్ కుటుంబ సభ్యులను సన్మానించి వారి కుటుంబాలకు వైద్య పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని, అదేవిధంగా తెలంగాణలోని 1200 వందల అమర్ల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్ అసోసియేషన్ సహస్ర ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్యాన్ని అందిస్తామని, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం అమర్ల కుటుంబాన్ని ఆదుకోవాలని, ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో డాక్టర్ నరేందర్ బాతరాజు ఆగయ్య బండ శేఖర్ మిర్యాల సంతోష్ బోయ బిక్షం నేరేడు మహేష్ చిట్యాల బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.