మైనారిటీ గురుకుల పాఠశాలకు సీలింగ్ ఫ్యాన్ల డాక్టర్ శ్రీనివాస్..

Dr. Srinivas is the ceiling fan for the minority gurukula school.నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి పట్టణంలోని  మైనారిటీ గురుకుల పాఠశాలకు రెడ్ క్రాస్ భువనగిరి డివిజన్ కమిటీ డైరెక్టర్ , డాక్టర్. ర్యాకల శ్రీనివాస్ విద్యుత్‌ ఫ్యాన్లను అందజేశారు. శనివారం మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ గండ్ర శ్రీకాంత్ అధ్యక్షతన సమావేశం నిర్వహించగా,  ముఖ్యఅతిథిగా రెడ్ క్రాస్ జిల్లా కమిటీ వైస్ చైర్మన్ డిడ్డి బాలాజీ,  డివిజన్ కమిటీ చైర్మన్ సద్ది వెంకట రెడ్డి లు హాజరై, మాట్లాడారు.  మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచీ ముగ్గురు విద్యార్థులు 10 జీపీఏను సాధించారనీ, ఇది హర్షించదగే విషయమని తెలిపారు. ప్రభుత్వం ద్వారా నడిచే ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మంచి సౌకర్యాలు అందిస్తూ వారికి విద్యపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరచడం అభినందనీయమన్నారు. ఈ పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం డాక్టర్‌ ర్యాకల శ్రీనివాస్  విద్యుత్ ఫ్యాన్లు అందించడం అభినందనీయమని, పాఠశాల యాజమాన్యం ఇట్టి  సౌకర్యాలను వినియోగించుకుని విద్యార్థుల యొక్క చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. అనంతరం ర్యాఖల శ్రీనివాస్ ను పాఠశాల ప్రిన్సిపల్ , పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా కమిటీ డైరెక్టర్ శేక్ హమీద్ పాష లు సన్మానించారు. ఈ కార్యక్రమంలో టౌన్ కమిటీ  కన్వీనర్ పురుషోత్తం రెడ్డి, ఎస్ మల్లేష్ .షుజావుద్దీన్ పాఠశాల ఉపాధ్యాయులు,  విద్యార్థులు పాల్గొన్నారు.