కార్యకర్తలకు అండగా ఉంటాం: డాక్టర్ సుధాకర్ రావు


నవతెలంగాణ పెద్దవంగర: బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మాజీ చైర్మన్ డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్ రావు అన్నారు. గురువారం మండలంలోని పోచారం గ్రామానికి చెందిన కూకట్ల సోమక్క ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన వెంట ముత్తినేని శ్రీనివాస్, కూకట్ల వీరన్న, సర్పంచ్ లక్ష్మీ బాలు నాయక్, మద్దెల శీను, సారయ్య, శంకర్ నాయక్, సతీష్, మల్లేష్, వెంకన్న తదితరులు ఉన్నారు.