
వర్షాకాలంలో ప్రజలు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని తగు జాగ్రత్తలు పాటించాలని మండల ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ సుకుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని రాంనగర్ పంచాయతీ పరిధిలోని ఎల్బీనగర్ గ్రామంలో సిబ్బందితో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ప్రధానంగా మహిళలకు ఆరోగ్యం విషయంలో తగు సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ వైద్య శిబిరంలో 66 మందిని పరీక్షించగా ఇద్దరూ జ్వర పీడితులు ఒక ఆరుగురు బి పి పేషెంట్లు కాగా మిగతా వారందరికీ పరీక్షించి అవసరమైన మందులను అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సదానందం సి హెచ్ ఓ
హెల్త్ అసిస్టెంట్ జంపయ్య ఏఎన్ఎం సరిత ఆశ కార్యకర్త పద్మ సుజాత రాజేశ్వరి బి సుజాత జ్యోతి కవిత లు పాల్గొన్నారు.