లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు చారిత్రాత్మక అవసరం: డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు

నవతెలంగాణ – పెద్దవూర
లోక్ సభ ఎన్నికలో నల్లగొండ నుంచి కుందూరు రఘువీర్ ను భారీ మెజారిటీతో  గెలిపించాలని ఉభయ తెలుగు రాష్ట్రాల మాజీ సమాచార కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వరు అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం అనుముల హాలియా లోరిటర్డ్ ఉద్యోగుల భవనంలో సమాచారం హక్కు చట్టం పై అవగాహన కల్పించి మాట్లాడారు.రాష్ట్ర అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి పాలన నిర్ణయాలు అభినందనీయమని అన్నారు. ఈ ఎన్నికల్లో ఆర్టి ఐ కార్యకర్తలు, మేధావులు విద్యావంతులు కాంగ్రెసును గెలిపించాలని కోరారు. దేశానికి గాంధీ కుటుంబ త్యాగం మరువలేమని, కాంగ్రెస్ బలహీనమైతే దేశం బలహీనం అవుతుందని తెలిపారు.కాంగ్రెస్ తోనే సమాచార హక్కు చట్టం సాధ్యమైందని లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు  దేశ అభివృద్ధికి మలుపు అని అన్నారు. సమాచార హక్కు చట్టం వ్యవస్తాపక అధ్యక్షులు యారమాద కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశం లో మాట్లాడారు.మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి చేసిన అభివృద్ధిని చూసి, ఆయన వారసుడు నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రఘువీర్ ను గెలిపించేందుకు మేధావులు ముందుకు రావాలన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి జీవోను అందరికి  ఆన్లైన్ విధానంలో అందుబాటులో ఉండేలా, ఆన్లైన్ విధానంలో ఆర్టిఐ దరఖాస్తుల స్వీకరిస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని అన్నారు.  దేశ సమగ్రతను, దేశభక్తి, బహుళ జాతుల సంస్కృతులను, లౌకికవాదం, సమానత్వం రక్షించబడాలంటే దేశంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ప్రభుత్వం దీర్ఘకాలిక నిర్ణయాలు అమలు చేయడంతో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి  దోహదం చేస్తున్నాయి. కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ విజన్ ను ముందుకు తీసుకుపోయే విధంగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ పాలన ఉందన్నారు.  కావున ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని ఎక్కువ లోక్ సభ స్థానాలు గెలిచే బాధ్యత తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ హయాంలోనే సమాచార హక్కు చట్టం, విద్యాహక్కు చట్టం, గృహహింస చట్టం,  పేదలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇలా అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయన్నారు.  ప్రభుత్వ పాలనలో పారదర్శకత ఉండేందుకు, ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించేందుకు సమాచార హక్కు చట్టం వచ్చిందన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా సమాజంలో జరుగుతున్న అవినీతిని బయటకు తీసేందుకు ఆర్టిఐ కార్యకర్తలు నిత్యం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.  ఆర్టిఐ చట్టం వచ్చిన తర్వాత సామాన్యుడు గౌరవం పెంచిందని, గతంలో అధికారులు సామాన్యులను పరిగణలోకి తీసుకునేవారు కాదని, ఆర్టిఐ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత 140 కోట్ల మంది ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం అధికారులకు ఏర్పడిందన్నారు. సమాచార హక్కు చట్టం కమిషనర్లను కొద్ది రోజుల్లోనే నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు పేర్కొనడం హర్షనీయమన్నారు. భారత  జాతిపిత మహాత్మా గాంధీ కన్న కలలు నిజం కావాలంటే ఆర్టిఐ చట్టం పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారతదేశంలో గాంధీ కుటుంబం చేసిన త్యాగాలను ప్రస్తుత పార్టీలు గుర్తించకపోవడం దారుణం అన్నారు.   మేధావులు, ఉద్యోగులు, జర్నలిస్టులు అందరూ ఏకతాటిపై వచ్చి ప్రజాస్వామ్యంలో   ఓటు పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. ఓటు ద్వారానే మన దేశ అభివృద్ధి ఆధారపడి ఉందని, దీనిని దేశంలోని యువత ప్రతి ఇంట్లో తమ కుటుంబ సభ్యులకు వివరించాలని ఆయన కోరారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ లోక్ సభ  అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని, ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కోటగిరి దైవదీనం,జిల్లా అధ్యక్షులు భైరు సైదులు,చిత్రం శ్రీనివాస్,నియోజకవర్గం అధ్యక్షులు ప్రకాష్, సమాచార హక్కు మండల అధ్యక్షులు మూల శేఖర్ రెడ్డి జయంత్, పృద్వి,రజనీకాంత్, అబ్రర్, మూల శ అన్వర్, ఇబ్రహీం, రామకృష్ణ, శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు.