షాబాద్‌ మండల వైద్యాధికారిగా డాక్టర్‌ విజయలక్ష్మి

Navatelangana,Telangana,Telugu News, Telangana News,Rangareddyనవతెలంగాణ-షాబాద్‌
మండల వైద్య అధికారినిగా డాక్టర్‌ విజయలక్ష్మి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలో భాగంగా ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్‌ శ్రీనివాస్‌ బదిలీ కావడంతో ఆయన స్థానంలో డాక్టర్‌ విజయలక్ష్మి వచ్చినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా విధులు నిర్వహిస్తానని అన్నారు.