
ఈనెల 10న నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని రెంజల్ జిల్లా పరిషత్, నీలా జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉపాధ్యాయులు సహకరించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ వినయ్ కుమార్ కోరారు. మల పదార్థంతో కలుస్తమైన నేల ద్వారా వ్యాప్తి చెందే ఈ నులిపురుగుల వలన రక్తహీనత, పోషకాహార లోపం, శారీరక మానసిక అభివృద్ధి బలహీన పడడం, జరుగుతుందన్నారు. మండలంలో ఒకటి నుంచి 19 సంవత్సరాల లోపు బాలురు 4111, బాలికలు 49 29, మండలంలో మొత్తం 8340 మంది గుర్తించడం జరిగిందన్నారు. వీరందరికీ ఈనెల 10న మాత్రలు పంపిణీ చేయడానికి వైద్య సిబ్బందిని సిద్ధం చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తీర్ణ అధికారులు కలిపే రవీందర్, శ్రావణ్ కుమార్, మండల విద్యాశాఖ అధికారి కట్ట ఆంజనేయులు, పిఆర్టియు మండల అధ్యక్ష కార్యదర్శులు టి.సోమలింగం గౌడ్, కిషోర్ కుమార్, భూమాయప్ప, కూనేపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, వీరన్న గుట్ట ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.