పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: డా.వినయ్ కుమార్

నవతెలంగాణ – రెంజల్

నిండు జీవితానికి రెండు చుక్కలు అనే నినాదంతో మండలంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ వినయ్ కుమార్ స్పష్టం చేశారు. గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మార్చి 3 నుంచి5 వరకు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమం మండలంలో జీరో నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలు4650 మంది పిల్లలు ఉన్నారని, వారికి మండలంలో 25 పోలే కేంద్రాలతో పాటు మొబైల్ టీమ్ లు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వినయ్ కుమార్, డాక్టర్ సహిస్తా పిర్దోస్, డాక్టర్ ప్రమోదిత, డాక్టర్ ఉజ్మ, ఆరోగ్య విస్తీర్ణ అధికారులు కరిపే రవీందర్, శ్రావణ్ కుమార్, పబ్లిక్ స్టాప్ నర్సు రాణి, హే మ్యాచ్ హెల్ప్ఇస్ లక్ష్మీనారాయణ, ఇర్ఫాన్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు, పాల్గొన్నారు.