కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించిన డాక్టర్ వినయ్ కుమార్

నవతెలంగాణ – రెంజల్

ప్రతి సంవత్సరం జనవరి 30న మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని డాక్టర్ వినయ్ కుమార్ స్పష్టం చేశారు. రెంజల్ మండలం నీల గమపంచాయతీ, జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. మైకోబాక్టీరియం లేప్రే అనే బ్యాక్టీరియా వలన ఈ వ్యాధి సోపుతోందని ఆయన తెలిపారు. స్పర్శ లేని రాగి వర్ణపు మచ్చలు ఉంటే ఈ వ్యాధి సోకుతుందని ఆయన అన్నారు. దీనికి మల్టీ డ్రగ్స్ అనే సికిత్స ద్వారా నయం అవుతుందన్నారు. ప్రతి గ్రామము అంగన్వాడి కేంద్రాలలో ఇట్టి అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గౌరాజీ లలితా రాఘవేందర్, ఉప సర్పంచ్ మార నాగభూషణం, ఆరోగ్య విస్తీర్ణ అధికారులు చింతల శ్రావణ్ కుమార్, కరిపే రవీందర్, ఇమ్రాన్ బేగ్, ఆరోగ్య కార్యకర్తలు సరోజా, శోభ, పాలకవర్గ సభ్యులు ప్రజలు పాల్గొన్నారు.