నోటీసు బోర్థుల పై ముసాయిదా ఓటర్ల జాబితా

Draft voter list on notice boardsనవతెలంగాణ – పెద్దవూర
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వారి ఆదేశాల మేరకు  పంచాయతీ రెండవ సాధారణ ఎన్నికల కొరకు పెద్దవూర పాత 26 పంచాయతీలతో పాటు మరో కొత్త పంచాయతీలు సంగారం, పుల్యా తండ పంచాయతీలు మొత్తం 28గ్రామ పంచాయతీల  యొక్క వార్డులవారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను మండల కేంద్రం లోని పంచాయతీ కార్యాలయం, మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో నోటీసు బోర్డులపై ఉంచామని ఎంపీడీఓ ఉమాదేవి శుక్రవారం విలేకరులతో తెలిపారు.
ఇట్టి ముసాయిదా గ్రామ పంచాయితీగాని,వార్డుల వారీ ఓటర్ల జాబితా విషయంలో ఏవైనా అభ్యంతరములు ఉన్నయెడల రాష్ట్రఎన్నికల సంఘం వారి నోటిఫికేషనులో తెలిపిన విధంగా ఈ నెల 14వ తేదీనుంచి 21 తేదీ వరకు పెద్దవూర మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో తమ అభ్యంతరములను తెలియజేయవలసినదిగా కోరారు.