‘డ్రయినేజీ అవుట్‌ లెట్‌ సమస్యను పరిష్కరించాలి’

నవతెలంగాణ – మీర్‌ పేట్‌
మీర్‌పేట్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ 16వ డివిజన్‌ పరిధిలోని సాయి సామ్రాట్‌ కాలనీలో ఉన్న డ్రైనేజీ అవుట్‌ లెట్‌ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కార్పొరేటర్‌ ఏనుగుల అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ఆదివారం కాలనీవాసులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ మాట్లాడుతూ సాయి సామ్రాట్‌ కాలనీలో డ్రైనేజీ ఔట్లెట్‌ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేద న వ్యక్తం చేశారు. స్పందించిన మంత్రి దాని నిర్మాణం కోసం నిధుల వ్యయం అంచనాలు వేయాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ తీగల విక్రమ్‌ రెడ్డి, సాయి సామ్రాట్‌ కాలనీ అసోసియేషన్‌ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.