వ్యక్తిగత వ్యర్ధాలతో డ్రైనేజీ…

  • – మురికి వాసన వెదజల్లుతున్న వైనం…
    నవతెలంగాణ – అశ్వారావుపేట
    గృహ అవసరాల ద్రవ వ్యర్ధాలు, వీధుల్లో నుండి వచ్చే వర్షపు నీరు నిల్వ ఉండకుండా వాటిని పల్లపు ప్రాంతాలకు తరలించే నిర్వహణ క్రమం మే మురుగు కాలువలు ఏర్పాటు ఉద్దేశ్యం. కానీ దీనికి భిన్నంగా అశ్వారావుపేట డ్రైనేజీ వ్యవహారం ఉందంటే అతిశయోక్తి కాదు. గత సంవత్సరం కాలంగా నిర్మాణాలు జరుగుతున్న అశ్వారావుపేట సెంట్రల్ లైటింగ్ పనుల్లో అనేక వైఫల్యాలు బహిర్గతం అవుతున్నాయి. ఇందులో మొదటిది ప్రధాన రహదారి ని సైతం ఆక్రమించుకుని బహుళ అంతస్తులు నిర్మాణాలు చేపట్టడం ఒకటి అయితే రెండోది గృహ ద్రవ వ్యర్ధాలతో పాటు వ్యక్తిగత ద్రవ వ్యర్ధాలు (మూత్రం,స్నానపు నీరు) సైతం మురికి కాలువల్లోకే విడుదల చేయడం బహిర్గతం అయింది.మరుగు దొడ్డి లో నుండి నేరుగా పైపులను మురికి కాలువలకు అనుసంధానం చేయడం కనపడుతుంది. ప్రస్తుతం సెంట్రల్ లైటింగ్ కోసం డ్రైనేజీ నిర్మాణం చేపట్టడంతో ప్రత్యామ్నాయం లేక ద్రవ వ్యర్ధాలు నిర్మాణంలో ఉన్న కాలువలో చేరడంతో దుర్గంధం వెదజల్లుతుంది.దీంతో వ్యాపారులు, వినియోగదారులు నిత్యం మాస్క్ లతో కాలం వెళ్లదీస్తున్నారు. శరవేగంగా డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేసి మురికి కంపు నుండి విముక్తి కల్పించాలని పట్టణ వాసులు వేడుకుంటున్నారు.