అకాలవర్షంతో నిండిన డ్రయినేజీలు

నవతెలంగాణ-దేవరకొండ
దేవరకొండ పట్టణంలో మంగళవారం ఉదయం అకాల వర్షం కురవడంతో డ్రయినేజీలు నిండి నీరంతా రోడ్లపైకి వచ్చింది. మున్సిపల్‌ చైర్మెన్‌ ఆలంపల్లి నర్సింహ, కమిషనర్‌ వెంక టయ్య, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ జాఫర్‌ అలీ నిండిన డ్రయినేజీలను పరిశీలించి వెంటనే మరమ్మతులు చేపట్టారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చర్యలుచేపట్టారు. డ్రయినేజీలో ప్లాస్టిక్‌ కవర్లు, డబ్బాలు, సీసాలు, వేయడం వల్ల వర్షాలు రావడంతో అవి అడ్డు తగిలి నీళ్లు రోడ్లపైకి వచ్చాయన్నారు. వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.