మోడల్ పోలింగ్ స్టేషన్ గా పసర: డీఆర్ డీఓ, డీపీఓ శ్రీనివాస్

నవతెలంగాణ – గోవిందరావుపేట
మోడల్ పోలింగ్ స్టేషన్ గా పసర పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని గుర్తించినట్లు డి ఆర్ డి ఓ మరియు డిపిఓ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన డిపిఓ శ్రీనివాస్ పసర  పాఠశాలలో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని మోడల్ పోలింగ్ కేంద్రంగా గుర్తించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఓటర్లకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చాలని కార్యదర్శి శరత్ బాబు ను ఆదేశించారు. ఓటర్లకు అవసరమైన ఎండ నుండి తట్టుకునే విధంగా నీడ, త్రాగునీరు ఏర్పాటు చేయాలని సూచించారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. ఓటు విలువ ప్రజలకు తెలియపరచాలని అన్నారు. అధిక సంఖ్యలో ఓటు వినియోగంలో పాల్గొనే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జవహర్ రెడ్డి, ఎంపీ ఓ సాజిదా బేగం ఈజీఎస్ ఏపీఓ ప్రసూనరాణి పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.