
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించే యూనిఫామ్ ల పనులలో బేగం పెంచాలని సిద్దిపేట డిఆర్డిఓ జయదేవ్ ఆర్య అన్నారు. శనివారం హుస్నాబాద్ మండలంలోని పోతారం ఎస్ గ్రామంలోని శ్రీ శక్తి స్వశక్తి టైలరింగ్ యూనిట్ ను డిఆర్డిఓ జయదేవ్ ఆర్య సందర్శించారు. పాఠశాలలో ప్రారంభం కానున్న నేపథ్యంలో స్కూల్ యూనిఫామ్ లను త్వరగా కుట్టలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్ విద్యాసాగర్, సేర్ఫ్ ఏపిఎం జి శ్రీనివాస్ గౌడ్, చేర్యాల ఏపిఎం ప్రకాశ్, కోహెడ ఏపీఎం తిరుపతి గౌడ్, ప్రసాద్ ,సీసీలు బిక్షపతి, రవీందర్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.