కూలీలు కనీస వేతనం పొందే విధంగా పనిచేయాలి: డీఆర్ డీఓ

నవతెలంగాణ – వలిగొండ రూరల్
ఉపాదిహామీ పథకంలో పని చేసే కూలీలు కనీస వేతనం 272 రూపాయలు పొందే విధంగా కొలతలతో కూడిన పనులు చేయాలని డి ఆర్ డి ఓ కృష్ణన్ అన్నారు. శుక్రవారం మండలంలోని టేకులసోమారం, పహిల్వాన్ పురం గ్రామాల్లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాదిహామీ పథకంలో భాగంగా కూలీలు చేస్తున్న పనులను ఆకస్మికంగా తనిఖీ చేసి ఆయన గ్రామాల్లోని నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాదిహామీ పనులల్లో పాల్గొనే కూలీలు చేసిన పనులకు కచ్చితమైన కొలతలు ఉండాలని, నర్సరీల్లో పెంచే మొక్కల పెరుగుదల 90 శాతం బ్రతికే విధంగా నర్సరీ నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని, మొక్కల
పెరుగుదలకు జీవామృతం వాడాలని, హరిత హారంలో నాటిన ప్రతి మొక్కలకు క్రమం తప్పకుండా నీళ్లు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జితేందర్ రెడ్డి, ఏపీవో పరుశరాం, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.