
రాష్ట్రంలో మహిళ సంఘాల్లో ఉన్న మహిళాలను లక్షాది కారి చేయడానికి వారికి సరియైన జీవనోపాదులు కల్పించి ఆర్థికంగా సహయం చేయలని నిజామాబాద్ డిఅర్డిఓ డిఅర్డిఎ పిడి సాయ గౌడ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో డిచ్ పల్లి ,ఇందల్ వాయి మండలాల విఓఎ, సి సి లకు రెండు రోజులపాటు లక్ పతి దిది పై శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షాధికారి చేయడానికి సభ్యురాలిగా వారిగా ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. మహిళ సభ్యులకు ప్రభుత్వం ద్వారా కల్పించే పథకాల ను ఆరుగురు అందరికి అందించాలని బ్యాంకు లింకేజీ, శ్రీనిధి రూణ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపిడిఓ రవీందర్, డిపిఎం సాయిలు, ఏపిఎం లు గంగాధర్, సువర్ణ,రజీత, రాజేందర్, రెండు మండలల విఓఎ లు,సిసి లు తదితరులు పాల్గొన్నారు.