న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తమ ఉద్యోగులు ధరించే దుస్తుల విషయంలో పలు సూచనలు చేసిందని సమాచారం. వర్క్ ఫ్రం హోం, హైబ్రిడ్ పని విధానాన్ని రద్దు చేసి.. నవంబర్ 1 నుంచి పూర్తిగా ఆఫీసులకు రావాల్సిందేనని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో సిబ్బంది ధరించే దుస్తుల విషయంలో ఆదేశాలు జారీ చేసింది. వేషధారణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్‌ఆర్ హెడ్ మిలింద్ లక్కడ్ ఉద్యోగులకు మెయిల్స్ చేశారు. పురుషులు తప్పని సరిగా ఫుల్ షర్టులతో టక్ చేసుకోవాలి. మహిళా ఉద్యోగులు బిజినెస్ ఫార్మల్స్, హాఫ్ స్లీవ్ షర్టులు, టర్టిల్‌నెక్, ఖాకీ చొక్కాలు, చినోలు, కుర్తీ, సల్వార్‌లను ధరించాలని సూచించింది.