పూరీ ఆలయంలో డ్రెస్‌ కోడ్‌ తప్పనిసరి

పూరీ ఆలయంలో డ్రెస్‌ కోడ్‌ తప్పనిసరిపూరీ : ఒడిశాలో ప్రముఖమైన పూరీ జగన్నాథుని ఆలయంలో సోమవారం నుంచి డ్రెస్‌ కోడ్‌ను తప్పనిసరి చేశారు. ఈ విషయాన్ని శ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్‌ (ఎస్‌జెటిఎ) ప్రకటనలో తెలిపింది. జనవరి 1 నుంచి సంప్రదాయ దుస్తులను ధరించినవారినే ఆలయంలోకి అనుమతిస్తామని తెలిపింది. మగవారు థోతి, తవ్వాలు, మహిళలు చీరలు లేదా సల్వార్‌ కమీజ్‌లు ధరించాలని విజ్ఞప్తి చేసింది. హాఫ్‌ ప్యాంట్లు, షార్ట్‌లు, చిరిగిన జీన్స్‌, స్కర్టులు, స్లీవ్‌లెస్‌ దుస్తులు ధరించిన వారికి అనుమతి ఉండదని తెలిపింది. అలాగే ఆలయంలో ఇప్పటికే గుట్కా, పాన్‌లపై నిషేధం ఉన్న విషయాన్ని మరోసారి గుర్తు చేసింది.