నవతెలంగాణ రెంజల్: మండలం ఆదర్శ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సంక్రాంతి పండుగ ను పురస్కరించుకొని సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా వేషాధారణ పలువురిని ఆకర్షించింది. పల్లెటూరు వాతావరణం తలపించే విధంగా విద్యార్థుల వేశాదరణలు పండుగ వాతావరణం తెలియజేస్తుంది. పాఠశాల ప్రిన్సిపల్ బలరాం మాట్లాడుతూ పాఠశాలలో ఈ విధంగా విద్యార్థినీ విద్యార్థులను ప్రోత్సహించినట్లయితేమన దేశ సంస్కృతి సాంప్రదాయాలు విద్యార్థులకు అలవడుతాయనిఆయన పేర్కొన్నారు. సంక్రాంతి పురస్కరించుకొని భోగిమంటలు, హరిదాసు, పిండి వంటలు, తదితర వేషాధనలో విద్యార్థినీ విద్యార్థులు పలువురిని ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చెన్నప్ప అరుణా జ్యోతి, సురేష్, శ్రీనివాస్, దాముల, సంతోష్, జైనుల్, సంతోష్, గీత, లావణ్య, ఆంజనేయులు, భాను, శాంతి, మయూరి, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.