డ్రీమ్ టీమ్ బ్యానర్ పై దర్శక, నిర్మాత, హీరో హరనాధ్ పొలిచెర్ల చేసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘డ్రిల్’. కారుణ్య చౌదరి హీరోయిన్‌గా, భవ్య, నిషిగంధ, తనికెళ్ళ భరణి, రఘుబాబు, జెమినీ సురేష్, కోటేశ్వరరావు, సత్తన్న, విశ్వ, జబ్బర్దస్థ్ ఫణి ప్రధాన తారాగణంగా చేసిన ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల16న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ, ‘ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన లిరికల్ సాంగ్స్, ట్రైలర్‌కు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ‘నాకు చిన్నప్పటి నుండి సినిమాలంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే గతంలోనే కెప్టెన్ రాణా ప్రతాప్, టిక్ టిక్, చంద్రహాస్ తదితర ఎనిమిది సినిమాలు తీశాను. అమెరికాలో డాక్టర్ వత్తిలో ఎంతో బిజీగా ఉన్నా ఎప్పటికప్పుడు సినిమా అప్డేట్స్ తెలుసుకొంటాను. లవ్ జిహాదీ మీద ఒక్క సినిమా కూడా తెలుగులో రాలేదు. అందుకే ఈ కాన్సెప్ట్‌తో సినిమా తియ్యాలని స్క్రిప్ట్ రెడీ చేసుకుని తీశాను. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. చూసిన ప్రేక్షకులందరికీ కచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది’ అని హీరో, దర్శక, నిర్మాత హరనాథ్ పొలిచెర్ల చెప్పారు. హీరోయిన్ కారుణ్య చౌదరి మాట్లాడుతూ,’మంచి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన హరనాథ్ పొలిచెర్లకి ధన్యవాదాలు’ అని అన్నారు. జెమినీ సురేష్ మాట్లాడుతూ, ‘హరనాథ్ పొలిచెర్ల చేసే ప్రతి సినిమాకు నన్ను గుర్తుపెట్టుకొని మంచి క్యారెక్టర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సినిమాలో ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకంతో మేమంతా ఉన్నాం’ అని చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ -వంశీ కష్ణ, మ్యూజిక్ -డిఎస్‌ఎస్‌కె, ఆర్ట్ -గోవింద్, ఎడిటర్ – రామ్, లిరిక్స్ – జొన్నవిత్తుల, హరనాథ్ పొలిచెర్ల, గడ్డం వీరు.