ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా నటించిన సినిమా ‘డ్రింకర్ సాయి’. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బార్సు అనేది ట్యాగ్ లైన్. ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించారు. కిరణ్ తిరుమలశెట్టి దర్శకుడు. ఈ నెల 27న ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ప్రొడ్యూసర్ ఇస్మాయిల్ షేక్ మాట్లాడుతూ,’సినిమా బాగా వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీవసంత్ మంచి సాంగ్స్ ఇచ్చారు. చంద్రబోస్ లిరిక్స్‌కు పేరొచ్చింది. ధర్మ, ఐశ్వర్య జోడి బాగుందంటూ రెస్పాన్స్ వస్తోంది. కథగా చూస్తే ఇందులో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి’ అని తెలిపారు. ‘ఏదో కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం చేసిన సినిమా కాదు. మేం ఒక కథను నమ్మి జెన్యూన్‌గా తెరకెక్కించాం’ అని డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టి చెప్పారు. హీరో ధర్మ మాట్లాడుతూ, ‘ప్రభాస్‌కి నేను పెద్ద అభిమానిని. ఆయన మాకు ఆల్ ది బెస్ట్ చెప్పి, ఈ సినిమా సక్సెస్ కావాలని మనస్పూర్తిగా చెప్పారు. ఇది నాకెంతో సంతోషాన్నిచ్చింది’ అని అన్నారు.