
నవతెలంగాణ – రాయపోల్
రోడ్డుమీద ప్రయాణం చేసేటప్పుడు వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపరాదని రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని దౌల్తాబాద్ ఎస్ఐ శ్రీరామ్ ప్రేమ్ దీప్, రాయపోల్ హెడ్ కానిస్టేబుల్ భాస్కర్ రెడ్డి అన్నారు. మంగళవారం దౌల్తాబాద్ మండలం ఎంజెపి కళాశాలలో ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీప్, రాయపోల్ మండలం సయ్యద్ నగర్ గ్రామంలో హెడ్ కానిస్టేబుల్ భాస్కర్ రెడ్డి జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట కమిషనర్ ఆదేశాల మేరకు జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు యువకులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని ప్రమాదాల నివారణ గురించి కృషి చేయాలని తెలిపారు.అధిక వేగం, మానవ తప్పిదం వల్ల ప్రమాదాలు జరిగే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని సూచించారు. మోటార్ సైకిల్ నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనం నడిపేటప్పుడు తప్పకుండా సీటు బెల్టు ధరించాలని సూచించారు. ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఇన్సూరెన్స్, మోహనాల ఫిట్నెస్ కలిగి ఉండి వాహనాలు నడపాలని పరిమితికి మించి వాహనం వేగంగా నడపొద్దని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. ప్రతి వాహనదారుడు తనకు తానుగా మరితే వాహనాలు నడిచినప్పుడే రోడ్డు ప్రమాదాలు నివారించడం సాధ్యమవుతుందని తెలిపారు. రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడిపి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంజెపి గురుకుల కళాశాల ప్రధానోపాధ్యాయులు స్వప్న, పోలీస్ సిబ్బంది, గ్రామ యువకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.