
నవతెలంగాణ-గోవిందరావుపేట
మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తప్పవని పసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ అచ్చా కమలాకర్ అన్నారు. ఆదివారం సందర్భంగా పలువురు వాహనదారులకు పసర చౌరస్తాలో బ్రీతింగ్ అనలైజర్ ద్వారా శ్వాస పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులను ఉద్దేశించి ఎస్ఐ కమలాకర్ మాట్లాడుతూ ఆదివారం అని మేడారం అని వాహన చోదకులు మద్యం సేవించి వాహనాలు నడిపినట్లయితే చాఠరీత్యా చర్యలు తప్పవని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా ఇతర వాహనదారులు కూడా ఇబ్బందులు పడతారని అన్నారు. ఇకపై ప్రతిరోజు ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తామని దొరికిన వారిని చట్టరీత్యా శిక్షిస్తామనిఅన్నారు, డ్రైవర్లు విధి నిర్వహణలో భాగంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు నడపకూడదని వారిని నమ్ముకున్న వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత ఉందని గుర్తించాలని అన్నారు.