
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి గ్రామంలో గత రెండు మూడు రోజులుగా తాగునీటి ఎద్దడి ఏర్పడిందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. గ్రామంలో ఉన్న బోర్ మోటార్ నీరు అందక,మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో తాగడానికి,ఇతరాత్ర అవసరాలకు ఇబ్బందులకు గురివుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు 2వ వార్డులో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని శనివారం మహిళలు ఖాళీ బిందెలు, బకెట్లతో రోడ్డుపై ఆందోళనలు చేపట్టారు.ఇప్పటికైనా తాగునీటి సమస్యను పరిష్కరించాలని లేదంటే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరిస్తున్నారు.