బోరు ఫ్లషింగ్, డిపెనింగ్ తో తీరనున్న ప్రజల త్రాగునీటి కష్టాలు 

నవతెలంగాణ యాదగిరిగుట్ట రూరల్
బోరు ఫ్లషింగ్ తో  ప్రజల త్రాగునీటి కష్టాలు తీరుతాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట, వారు మాట్లాడుతూ గ్రామంలో నీటి కొరత ఉందని కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దృష్టికి తీసుకు వెళ్లడంతో వెంటనే స్పందించారని తెలిపారు. సమ్మర్ ఆక్షన్ ప్లాన్ (ఎస్ ఎ పి) నిధులతో బోరు ఫ్లషింగ్, డిపెనింగ్ చేశారు. ఇక్కడున్న బోరుతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కు, స్కూలుకు వాటర్ సరఫరా జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ డెబ్లు ఎస్ ఏఈ ప్రజ్ఞ, పంచాయితి కార్యదర్శి నరేష్, కాంగ్రెస్ పార్టీ యాదగిరిగుట్ట మండల వర్కింగ్ ప్రెసిడెంట్, పిఎసిఎస్ డైరెక్టర్ యేమాల ఏలేందర్ రెడ్డి, మాజి వార్డ్ సభ్యులు కళ్లెం విజయ జహంగీర్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు పాండవుల సత్య ప్రకాష్, ఎం డి యాకూబ్, గూడూరు రాములు తదితరులు పాల్గొన్నారు.