నవతెలంగాణ – మల్హర్ రావు
మండుతున్న ఎండల నేపథ్యంలో పల్లెల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని భూపాలపల్లి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మండలంలోని ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులకు,పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. సోమవారం మండలంలోని వల్లెంకుంట గ్రామాన్ని ఎంపిఓ విక్రమ్ కుమార్ తో కలిసి సందర్షించారు. ఈ సందర్భంగా త్రాగునీటి సమస్యలు రాకుండా, ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించాలన్నారు.మంచినీటి సరఫరాఫై తెలంగాణ ప్రభుత్వం సూచించిన ఏడు రిజిస్టర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా అందరికీ మంచినీరు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కెడిసిఎంఎస్ వరిదాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. యువత, క్రీడాకారులతో మాట్లాడారు వేసవిలో క్రీడాకారులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు.