త్రాగునీటి ఎద్దడికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి: ఎంపీడీవో తిరుపతిరెడ్డి 

నవతెలంగాణ-రామారెడ్డి 
మండలంలోని ఆయా గ్రామాల్లో వేసవిలో త్రాగునీటి ఎద్దడిని నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని శుక్రవారం పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీవో తిరుపతిరెడ్డి సూచించారు. మండలంలోని పోసానిపేటలో వేసవిలో త్రాగునీటి ఎద్దడి ఉండను నందున ముందస్తు జాగ్రత్తగా రైతుల బోరు బావుల నుండి సరపర చేయాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరేష్, మాజీ సర్పంచ్ గిరెడ్డి మహేందర్ రెడ్డి, మిషన్ భగీరథ సూపర్వైజర్ స్వామి, గ్రామస్తులు నాయిని శ్రీనివాస్ రెడ్డి, గోగూరు రాజిరెడ్డి, కారోబా శంకర్ తదితరులు పాల్గొన్నారు.