మాదారంలో తాగు నీటి కటకట

మాదారంలో తాగు నీటి కటకటనవతెలంగాణ-తాండూర్‌
మండలం సింగరేణి ప్రాంతమైన మాదారం టౌన్‌ షిప్‌లో గత రెండు రోజుల నుంచి మంచినీటి సమస్య తీవ్రంగా నెలకొంది. ఎంవీకే 1ఇన్‌క్లైన్‌ నుంచి ఫిల్టర్‌ బెడ్‌కూ సరఫరా చేసే విద్యుత్‌ మోటారు చెడిపోవడంతో ఈ సమస్య తలెత్తింది. రెండు రోజుల నుంచి మంచి నీటిసరఫరా లేకపోవడంతో సింగరేణి యాజమాన్యం ప్రత్యామ్నాయంగా ట్యాంకుల ద్వారా కార్మిక కాలనీలో సరఫరా చేస్తుంది. సంబంధిత అధికారులు కూడా విద్యుత్‌ మోటారు మరమ్మతు పనులను చేపడుతున్నట్లు తెలిపారు.