
మంచిర్యాల ఎమ్మెల్యే, తన కార్యకర్తపై ఉన్న అభిమానాన్ని ఇలా చాటాడు. నస్పూర్ మున్సిపల్ ఛైర్మెన్ ఇటీవల నూతనంగా కొనుగోలు చేసిన మహింద్ర స్కార్పియో వాహనాన్ని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నడిపి చైర్మెన్ మదిలో సంతోషాన్ని నింపారు. తన నివాసం నుండి ప్రభుత్వ హాస్పిటల్ వరకు మున్సిపల్ చైర్మెన్ ను పక్కన కూర్చోబెట్టుకొని స్వయంగా ఎమ్మెల్యేనే వాహనాన్ని నడుపుకుంటూ రావడంతో అటు చైర్మెన్ తో పాటు కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. వాహనాలు నడపడం అంటే పిఎస్ఆర్ కు ఇష్టం అని, ఎంపీ ఎలక్షన్స్ రోజు కూడా ఒక్కరే వాహనాన్ని నడుపుకుంటు వెళ్లి ఓటేసి వచ్చారంటూ ముచ్చటించుకున్నారు కార్యకర్తలు.