
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
ఆర్టీసీ డ్రైవర్ లు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కలిగి ఉండాలని హుస్నాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ రెడ్డి అన్నారు. గురువారం హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ రెడ్డి డ్రైవర్లకు తగు సూచనలు చేశారు. హుస్నాబాద్ బస్ డిపో ని ఎలాంటి యాక్సిడెంట్ లేని డిపోగా ఉంచాలని కోరారు. డ్రైవింగ్ చేసే సమయంలో సెల్ ఫోన్ మాట్లాడవద్దన్నారు.రోడ్డుపై బస్సులను ఆపకుండా కాస్త రోడ్డు పక్కగా ఆపేలా చూడాలని సూచించారు అనంతరం డ్రైవర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.