ఖార్టూమ్ : సుడాన్ రాజధాని ఖార్టూమ్‌లో ఆదివారం ఒక బహిరంగ మార్కెట్‌పై జరిగిన డ్రోన్ దాడిలో 40 మందికి పైగా మరణించారు. సూడాన్‌లో అధికారం కోసం సైన్యం, పారామిలటరీ దళాల మధ్య కొన్ని నెలలుగా పోరాటం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆదివారం డ్రోన్ దాడి జరిగింది. డ్రాన్ దాడికి సైనిక వైమానిక దళమే కారణమని పారా మిలటరీ దళాలు ఆరోపిస్తున్నాయి. పారా మిలటరీ దళాలు సాధారణ ప్రజల ఇళ్లలో తిష్టవేసి సైన్యంపై దాడులకు పాల్పడుతుంది. దీంతో సైన్యం పౌరుల నివాసాలు, బహిరంగ ప్రదేశాలపై వైమానిక దాడులకు దిగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సుడాన్ సైన్యం-పారా మిలటరీ దళాల మధ్య పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో ఇప్పటి వరకూ కనీసం 4 వేల మంది మరణించిఉంటారని ఆగస్టులో ఐక్యరాజ్యసమతి అంచనా వేసింది.