బీజాపూర్ : కేంద్రం వైమానిక దాడులకు పాల్పడుతోందని మావోయిస్టులు ఆరోపించారు. సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని మెట్టగూడ, ఎరన్‌పల్లి, బొట్టేటాంగ్‌లలో డ్రోన్‌తో బాంబు దాడి జరిపినట్లు సీపీఐ (మావోయిస్ట్) సౌత్ సబ్ జోనల్ అధికార ప్రతినిధి సమ్త ఓ లేఖలో ఆరోపించారు. ఈ నెల 13న ప్రజలు సంక్రాంతి జరుపుకుంటుండగా.. బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలోని పొలాలు, అటవీ ప్రాంతంలో డ్రోన్ నుంచి బాంబు పడ్డాయని ఆరోపించారు. వీటికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌లో ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ బుల్డోజర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేలాది మంది పోలీసులను మోహరించి కొత్త క్యాంపులు నిర్వహిస్తున్నారని ప్రకటనలో పేర్కొన్నారు.
వందలాది బుల్ డోజర్లు, పొక్లెయిన్లు, వాహనాలు వినియోగించి అడవులను ధ్వంసం చేసి క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారని.. వాటి కోసం కల్వర్టులు, రోడ్లు, టవర్లు నిర్మిస్తున్నారన్నారు. గిరిజన ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, ఉప ముఖ్యమంత్రి విజరు శర్మ ఆదేశాల మేరకే ఇదంతా జరుగుతోందని.. కార్పొరేట్ కంపెనీల కోసమే సీఎం గిజన ముసుగు వేసుకున్నారని సమ్త విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ విధానమే కార్పొరేట విధానమని.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఆదివాసీల ప్రాబల్యం ఉన్న, అపారమైన ఖనిజ నిల్వలు అపారంగా ఉన్నాయని.. ఈ నిల్వలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు ప్రభుత్వం ఎన్నో ఏండ్లుగా ప్రయత్నాలు చేస్తుందని మావోయిస్టులు ఆరోపించారు. అభివృద్ధి అంటూ ఢంకా బజాయించేది ఇందుకేనంటూ విమర్శించింది.