-మొక్కలు నాటడం పై ఉన్న శ్రద్ధ – సంరక్షణపై లేదాయె?
– రోడ్లకు ఇరువైపులా కాలిపోతున్న చెట్లు
– పట్టించుకోని గ్రామపంచాయతీఅధికారులు సిబ్బంది
– నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం
– సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కాలిపోతున్న చెట్ల వీడియోలు..
నవతెలంగాణ – చివ్వేంల
అధికారుల నిర్లక్ష్యంతో హరితహారం అభాసు పాలవుతుంది. ప్రతి ఏటా లక్ష్యం మేర హరితహారం మొక్కలు నాటుతున్న, వాటి సంరక్షణ మాత్రం గాలి కొదిలేస్తున్నారు. అవెన్యూ ప్లాంటేషన్ పేరుతో ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ రోడ్లకు ఇరువైపులా వేల సంఖ్యలలో మొక్కలు నాటుతున్నారు. కానీ వాటి సంరక్షణ బాధ్యతలు మాత్రం పట్టించుకోవడం లేదు. రోడ్డుకు ఇరువైపులా గడ్డి ఏపుగా పెరగడం, వేసవిలో గడ్డి ఎండిపోవడం .. గుర్తుతెలియని వ్యక్తులు గడ్డికి నింపు పెట్టడంతో హరితహారం మొక్కలు, చెట్లు కూడా కాలి బూడిదవుతున్నాయి. కానీ అధికారులు చర్యలు తీసుకోక పోవడం విమర్శలకు తావిస్తోంది..

కాలిపోతున్న చెట్లు…
అవెన్యూ ప్లాంటేషన్ పేరుతో రోడ్డు ఇరువైపుల మొక్కలు నాటడం తరువాత పట్టించుకోకపోవడం అధికారులకు పరిపాటిగా మారింది. మొక్కల చుట్టూ పెరిగిన గడ్డికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెడుతున్నారు. ఈ కారణంగా హరితహారం చెట్లు కాలిపోతున్నాయి. బుధవారం సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం, బీమ్లా తండా గ్రామపంచాయతీ కి వెళ్లే ఆర్ అండ్ బి రహదారికి ఇరువైపులా ఉన్న మొక్కలు కాలిపోతున్న దృశ్యం కనిపించాయి. అదేవిధంగా మండలంలోని చాలా గ్రామాల్లో ఇలాంటి పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. ఇలా ప్రతి ఏటా జరుగుతున్నఅధికారులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు గాని పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మరికొన్ని గ్రామాలలో చెట్లకు నీళ్లు పెట్టకపోవడంతో చెట్లు ఎండ వేడికి ఎండిపోతున్నాయి. . హరితహారం చెట్ల సంరక్షణ బాధ్యతను పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం చేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు..
మండలంలోని వివిధ గ్రామాలలో రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ నిర్వహణపై ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా వేల మొక్కలు నాటుతున్నా. ఎన్ని మొక్కలు బతికాయి అని అధికారులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు . కొన్ని గ్రామాల్లో మొక్కలు ఎండిపోతుంటే, కాలిపోతుంటే ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారని, ప్రభుత్వానికి ప్రజలు పన్నుల రూపంలో సొమ్ము చెల్లించేనే, ప్రభుత్వ అధికారులు జీతాలు తీసుకుంటున్న, ఆయా శాఖల అధికారులు తమ విధులను ఎందుకు సక్రమంగా నిర్వహించరని ప్రశ్నిస్తున్నారు.విధుల పట్ల నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్న గ్రామపంచాయతీ కార్యదర్శుల పైన, ఉపాధి హామీ సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలని యిలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృత్తం కాకుండా జిల్లా అధికారులు స్పందించి హరితహారం మొక్కలు ఎండిపోకుండా , కాలిపోకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు..
స్పందించిన పంచాయతీ కార్యదర్శి..
బీమ్లా తండా గ్రామపంచాయతీ కి వెళ్లే ఆర్ అండ్ బి రహదారి కి ఇరువైపులా ఉన్న చెట్లు కాలిపోతున్నాయని సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియో లు చక్కర్లు కొట్టడంతో గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ సిబ్బందితో కలిసి మంటలను అర్పివేయడం జరిగింది…