ఎస్ఎస్ఆర్ కళాశాలలో డ్రగ్ అవగాహన సదస్సు 

Drug Awareness Seminar at SSR Collegeనవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్ ఎస్ ఆర్ కళాశాలలో ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ విజయ్ బాబు ఆధ్వర్యంలో గురువారం డ్రగ్స్ పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ విజయ్ బాబు మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తమ పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన సదస్సును నిర్వహించడం జరిగిందని అందులో భాగంగానే ప్రస్తుత సమాజంలో డ్రగ్స్ తీసుకోవడం వల్ల జరిగే అనర్థాలను క్షుణ్ణంగా కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు వివరించారు. ఎట్టి పరిస్థితులలో కూడా ఇలాంటి వాటికి విద్యార్థులు చాలా దూరంగా ఉండాలని అలాంటప్పుడే సమాజంలో మంచి పేరు పాటు తల్లిదండ్రులకు పేరు తెచ్చిన వారవుతారని ఈ సందర్భంగా తెలిపారు. వాటి వలన కుటుంబాలను సైతం దూరం చేసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం మారయ్య గౌడ్ తోపాటు ఒకటవ పోలీస్ స్టేషన్ సిబ్బంది, కళాశాల విద్యార్థిని విద్యార్థులు సుమారు వందకు పైగా అవగాహన సదస్సులో పాల్గొన్నారు.