
డ్రగ్స్ వంటి ప్రభుత్వాన్ని చేత పదార్థాలపై ఉక్కు పాదం మోపాలని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు బుధవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను సందర్శించి రికార్డులను పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ.. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిగా ఉంచి వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లాలో ప్రశాంత వాతావరణము నెలకొందని అన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలైన గంజాయి. పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచి వారిపై పీడి యాక్ట్ నమోదు చేస్తామన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి రవికుమార్ ఎస్సై సైదులు తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.