నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పౌరసరఫరాల శాఖ పేరు ప్రతిష్టలు పెరిగేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆ శాఖ కమిషనర్ డి.ఎస.్ చౌహన్ అన్నారు. తద్వారా రాష్ట్రంలో అన్ని శాఖల కంటే తమశాఖ ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.శుక్రవారం హైదరాబాద్ లోని ఎర్రమంజిల్‌లోని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చౌహన్ జాతీయ జెండాను ఎగురవేశారు. క్షేత్ర స్థాయి సిబ్బంది మరింత అంకితభావంతో పనిచేయాలని కోరారు.