నవతెలంగాణ కంటేశ్వర్: డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్ధింపజేయాలని బీసీ ఉపాధ్యాయ సంఘం నాయకుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఐటి శాఖ మంత్రి, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ని విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేష్ గారిని కలిసి కేంద్ర ప్రభుత్వ మెమో 57 ఆధారంగా డిఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలి అని వినతిపత్రం అందజేశారు. దీనికి వారు సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో అమలవుతున్న తొలి మెట్టు ,ఉన్నతి కార్యక్రమాలను రద్దు చేయాలని, జీవో 317 ద్వారా బదిలీ అయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, బదిలీ అయి రిలీవ్ కాని ఉపాధ్యాయులను తక్షణమే రిలీవ్ చేయాలని, పదోన్నతుల లో టెట్ మినహాయింపు ఇవ్వాలని లేదా ఆరు సంవత్సరాల్లో పాస్ అయ్యే విధంగా అవకాశం ఇవ్వాలని , ఎస్ ఇ ఆర్ టి ని ప్రక్షాణాల చేయాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ని కోరారు . ఈ కార్యక్రమంలో 2003 డిఎస్సీ పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మడవేడి వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్షి ఇమ్మడి సంతోష్ కుమార్,కోశాధికారి జి. వేణుగోపాల్, యు. విజయ్ కుమార్ ,కె. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.