జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశానుసారం జిల్లా పౌరసరఫరాల అధికారి వి. వెంకటేశ్వర్లు గురువారం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని తనిఖీ చేశారు. శానిటేషన్ ను మెరుగుపరచుకోవాలని, ఆస్పత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలని, టెస్టుల కోసం వచ్చిన రోగుల నుండి రక్త నమూనాలను త్వరగా తీసుకోవాలని సూచించారు. వీల్ చైర్ నందు పేషెంట్ ను బంధువులే తీసుకువెళ్లడాన్ని గమనించిన డీఎస్ఓ అక్కడున్న సిబ్బందికి చెప్పి పేషెంట్ ను తీసుకెళ్లాలని సూచించారు.