నేటి నుండి బియ్యం పంపిణీ: డిఎస్ఓ వెంకటేశ్వర్లు 

నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
జిల్లాలో ఆహార భద్రత కార్డుదారులు నేటి నుండి రేషన్ షాప్ ల వద్ద నుండి ఉచిత బియ్యాన్ని పొందాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి  వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆహార బద్రత కార్డుదారులు మొత్తం 435751నికి 5952.301 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించినట్లు పేర్కొన్నారు.30237 అంత్యదయ కార్డుదారులకు 883.646 టన్నులు,  అన్నపూర్ణ ఆహార బద్రత కార్డుదారులు మొత్తం-63 కార్డులకు 0.420 మెట్రిక్ టన్నులు, జిల్లాలోని మొత్తం  466051 కార్డులకు 6836.367 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించబడినట్లు పేర్కొన్నారు.  ఆహార భద్రత కార్డు కలిగిన ప్రతి లబ్దిదారునికి 6 కిలోల చొప్పున, అంత్యోదయ కార్డుదారునికి 35 కిలోల చొప్పున, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోల చొప్పున నేటి నుండి బియ్యని ఉచితముగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్డుదారులు రేషన్ షాప్ కు వెళ్లి ఉచిత బియ్యాన్ని పొందాలని తెలిపారు. రేషన్ షాప్ డీలర్లు సమయానికి అనుగుణంగా షాపులను తెరిచి ఉంచి బియ్యం సరఫరా చేయాలని సూచించారు.