తాడ్వాయి పోలీసులతో కలిసి డిఎస్పి ఫుట్ పెట్రోలింగ్

– నార్లాపూర్, మేడారం గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల పరిశీలన
నవతెలంగాణ -తాడ్వాయి : మండలంలోని నార్లాపూర్, మేడారం  గ్రామాలలో సోమవారం, ములుగు డిఎస్పీ ఎన్ రవీందర్, స్థానిక ఎస్సై ఓంకార్ యాదవ్, పస్రా సిఐ శంకర్ ల తో కలిసి, స్థానికులతో నడుచుకుంటూ, సంభాషించుకుంటూ ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. నడుచుకుంటూనే వెళ్లి నార్లాపూర్, మేడారం పోలింగ్ కేంద్రాలను సందర్శించి, పరిశీలించారు.  ఈ సందర్భంగా ములుగు డిఎస్పి ఎన్ రవీందర్ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా అందరూ సహకరించాలని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ ఏసి వర్గీష్, సివిల్ సిఆర్పిఎఫ్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.