అన్ని దానాల కన్న అన్నదానం ఎంతో మిన్న : డీఎస్పీ నాగభూషణం

నవతెలంగాణ-సూర్యాపేట : అన్ని దానాల  కన్నా అన్నదానం ఎంతో మిన్న అని డీఎస్పీ నాగభూషణం అన్నారు. శుక్రవారం స్థానిక 19 వ వార్డు భగత్ సింగ్ నగర్ లోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ దగ్గర నిర్వహిస్తున్న దుర్గామాత నవరత్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించడమే కాకుండా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. అందరూ భక్తిశ్రద్ధలతో దుర్గామాత ఉత్సవాలను నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 19వ వార్డు కౌన్సిలర్ సుంకరి అరుణ రమేష్, కాలనీ వాసులు కోట గోపి,రమేష్, కొండయ్య, యాదగిరి,ఉత్సవ కమిటీ సభ్యులు కన్మంత రెడ్డి కవిత, తిరుపతమ్మ, సృజన,ఇందిర తదితరులు పాల్గొన్నారు.