పోలీస్ స్టేషన్ ను సందర్శించిన డీఎస్పీ సత్యనారాయణ

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
పెద్ద కొడపగల్  మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ను మంగళవారం రోజున నూతనంగా బాన్సువాడ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణ స్థానిక పోలీస్ స్టేషన్ ను సందర్శించారు.ఈ సందర్భంగా రికార్డులను తనిఖీ చేసి స్టేషన్‌ పరిసరాలను పరిశీలించారు.100 డయల్‌ కేసుల్లో తక్షణమే స్పందించాలని సూచించారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు.అనంతరం పొలీస్ స్టేషన్ ఆవరణంలో మొక్కలను నాటి నీరు పోశారు.ఈ కార్యక్రమంలో సిఐ నరేష్,ఎస్ఐ కొనారెడ్డి,పోలీస్ సిబ్బందిలు పాల్గొన్నారు.