ఈ నెల 17 న జరిగే మొహర్రం పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని డిఎస్‌పి. శివరాంరెడ్డి కోరారు. నలగొండ ఒన్ టౌన్ పోలీసు స్టేషన్ లో సోమవారం అలం కమిటీ సబ్యులు, ఆర్గనైజేర్స్, మత పెద్దల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పండుగ ను భక్తి శ్రద్దలతో, ఎలాంటి ట్రాఫిక్ ఆంతరాయం లేకుండా జరుపుకోవాలని సూచించిచారు. ఈ కార్యక్రమంలో నలగొండ ఒన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ వి.శంకర్, అలం కమిటీ సబ్యులు తహేరుభాయి, బషీర్, హన్ను, పర్వెజు, యూసఫ్, తదితరులు లు పాల్గొన్నారు.