యువత చేడు అలవాట్లకు దూరంగ ఉండాలి: డీఎస్పీ శ్రీనివాస్ 

Youth should avoid bad habits: DSP Srinivas
Oplus_0

– వ్యసనాలతో అందమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు

నవతెలంగాణ – అచ్చంపేట 
యువకులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల వ్యసనాలతో అందమైన జీవితాలను నాశనం చేసుకోవద్దని అచ్చంపేట డిఎస్పి శ్రీనివాస్ సూచించారు . ఆదివారం నవ తెలంగాణతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గంజాయి వినియోగం పెరుగుతుందని, ప్రధానంగా యువత వినియోగిస్తున్నారని ప్రభుత్వం, ఉన్నత అధికారులు గుర్తించారు. అచ్చంపేట నియోజకవర్గంలో గంజాయిని పూర్తిగా నిర్మూలించడానికి  పకడ్బందీగా నిఘా నిర్వహిస్తున్నామని తెలిపారు. పట్టణం లో వ్యాపారులు తమ వస్తువులను రోడ్లపైకి పెడుతున్నారు దీనిద్వారా ప్రజలు వాహనదారుల రాకపోగాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించి సమస్యలు లేకుండా చూస్తామన్నారు. అదేవిధంగా ప్రధాన రహదారులపై వాహనాలు నిలుపుదల చేస్తే పెనాల్టీలతోపాటు కేసులు నమోదు చేస్తామని హెచరించారు. అక్రమ ఇసుక రవాణా జరగడం లేదని, అలాంటిది మా దృష్టికి వస్తే వెంటనే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
 శాంతిభద్రతల విషయంలో పోలీసులకు ప్రజలు సహకరించాలన్నారు.