విజయకుమార్‌కు డీఎస్పీ మద్దతు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అణగారిన కులాల అభ్యర్థి ఎస్‌ విజయకుమార్‌కు దళిత్‌ శక్తి ప్రోగ్రాం మద్దతు ప్రకటించింది. ఈ మేరకు డాక్టర్‌ విశారదన్‌ మహారాజ్‌ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నియోజకవర్గంలోని ఉపాధ్యాయులు విజయకుమార్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు.