ఏవైనా సమస్యలకు గురైతే సైబర్ క్రైమ్ కు సమాచారం అందించాలి: డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి

నవతెలంగాణ – ఆర్మూర్  

ఏవైనా సమస్యలకు గురైన సైబర్ క్రైమ్ కు సమాచారం అందించాలని డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి అన్నారు .పట్టణంలోని సాంఘిక సంక్షేమ మహిళ గురుకుల డిగ్రీ కళాశాలలో బుధవారం సైబర్ క్రైమ్ ఫై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాల గురించి వివరించినారు. ఇటీవల పోలీస్ బృందం వారి తరపున జరిగిన జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ క్రీడల్లో కెప్టెన్ గా వ్యవహరించి బంగారు పతకం సాధించిన అజ్మీర ఇందు   ను డీఎస్పీ ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో సిఐ రవికుమార్, ఎస్సై ప్రవల్లిక, కళాశాల ప్రిన్సిపల్ ధనవేని, వైస్ ప్రిన్సిపాల్ శరణ్య, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.