
రాజంపేట్ మండలంలో రైతు భరోసా సర్వే కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ తాసిల్దార్ సంతోష పరిశీలించారు. వ్యవసాయానికి యోగ్యం కాని భూములను గుర్తించాలని, గతంలో వ్యవసాయం చేసి ప్రస్తుతం వెంచర్లు, ఇతర పరిశ్రమలు ఏర్పడిన భూములను వ్యవసాయం యోగ్యం కాని భూములుగా నమోదు చేయాలని రెవెన్యూ, వ్యవసాయ అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.